కేటీఆర్ కాన్వాయ్‌కి ప్రమాదం.. ఎమ్మెల్సీకి గాయాలు

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనలో ఆదివారం స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది.

కేటీఆర్ కాన్వాయ్‌కి ప్రమాదం.. ఎమ్మెల్సీకి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనలో ఆదివారం స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో కేటీఆర్ కాన్వాయ్‌లోని రెండు కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. కన్నెపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్ స్టేషన్ ఘనపూర్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి వెనుక నుంచి వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్ల ముందు, వెనుక భాగాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఒక కారులో ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చేతికి స్వల్ప గాయమైంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది. తోటి నాయకులు ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కేటీఆర్ కాన్వాయ్‌ను నిలిపివేసి, శంభీపూర్ రాజు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాయకులంతా కలిసి కన్నెపల్లి పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

Next Story