- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శన ఉద్రిక్తం.. KTR కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు
కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్‌ని పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్/జనగామ: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. కేటీఆర్ పర్యటనను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారంటూ బీఆర్ఎస్ (BRS) శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్-వరంగల్ (Hyderabd-Warangal) జాతీయ రహదారిపై భారీగా మోహరించిన పోలీసులు.. జనగాం జిల్లా పెంబర్తి వద్ద కేటీఆర్ కాన్వాయ్‌ను బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. అయితే, ఉదయం కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శన కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేటీఆర్ కాన్వాయ్‌తో పాటు వస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతుల వాహనాలను పోలీసులు హైవేపై పలుచోట్ల నిలిపివేశారు. పెంబర్తి వద్దకు చేరుకోగానే పోలీసులు రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో కేటీఆర్ కాన్వాయ్ అక్కడే నిలిచిపోయింది.
పోలీసులతో KTR, BRS శ్రేణుల వాగ్వాదం..
కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనను అకారణంగా ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కేటీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలు వాహనాల నుంచి దిగి పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. శాంతియుతంగా పర్యటనకు వెళ్తుంటే అడుగడుగునా బారికేడ్లు అడ్డం పెట్టుడు ఏందని కేటీఆర్ ప్రశ్నించారు. మరోవైపు కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారనే వార్త తెలియడంతో జనగాం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు భారీ సంఖ్యలో పెంబర్తి బారికేడ్ల వద్దకు చేరుకుంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండటంతో హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.






