ఇన్ స్టాలో చైల్డ్ అబ్యూస్ యాడ్స్.. మెటాకు కేంద్రం 7 రోజుల డెడ్ లైన్!

by Prasad Jukanti |   (  Updated:2026-07-05 06:57:58  IST  )

ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై బీబీసీ సంచలన కథనం వెలువరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. 7 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని మెటాకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

ఇన్ స్టాలో చైల్డ్ అబ్యూస్ యాడ్స్.. మెటాకు కేంద్రం 7 రోజుల డెడ్ లైన్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‍స్టా గ్రామ్‍ అశ్లీల కంటెంట్ ను ప్రోత్సహించడంతో పాటు చిన్నారులపై లైంగిక వేధింపులకు చెందిన చిత్రాలు, వీడియోలను భారత్‍లో ప్రమోట్ చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో కేంద్రం సీరియస్ అయింది. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. బాలల లైంగిక వేధింపులకు (CSEAM) దారితీసే అన్ని రకాల కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ 'మెటా' (Meta) కు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఈ వివాదంపై సమగ్ర నివేదికను సమర్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం మెటా సంస్థను ఆదేశించింది.

ఏడు రోజుల్లోగా నివేదిక ఇవ్వండి:

ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటువంటి వివాదాస్పద కంటెంట్ ఎలా అనుమతించబడింది? మరియు దీనిపై తీసుకున్న ముందస్తు చర్యల గురించి 7 రోజుల్లోగా పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని ప్రభుత్వం మెటా సంస్థను వివరణ కోరినట్లు తెలుస్తోంది. నిర్దేశిత గడువులోగా సరైన సమాచారం అందించడంలో విఫలమైతే సమాచార సాంకేతిక చట్టం (IT Act), పోక్సో చట్టం (POCSO Act), 2012 లోని కఠినమైన నిబంధనల ప్రకారం మెటా సంస్థపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇటువంటి అసాంఘిక కంటెంట్‌ను మరింతగా యూజర్లకు చేరవేసే ఇన్‌స్టాగ్రామ్ 'అల్గారిథమిక్ యాంప్లిఫికేషన్' (Algorithmic amplification) విధానాన్ని అడ్డుకోవడానికి తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.

BBC కథనం:

ఇన్ స్టా గ్రామ్ భారత్ లో అశ్లీల కంటెంట్ ను ప్రోత్సహిస్తోందని బీబీసీ ఓ సంచలన కథనాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. ఒళ్లు గ‌గురుపొడిచే రీతిలో ఇన్‌స్టాగ్రామ్ త‌న యూజ‌ర్లను చైల్డ్ సెక్సువ‌ల్ వీడియోల‌తో రెచ్చగొడుతున్నట్లు ఆ కథనంలో పేర్కొంది. భద్రతా చర్యలలో తీవ్రమైన లోపాలను బయటపెడుతోందని ఆరోపిస్తూ బీబీసీ రాసిన ఈ కథనం పెద్ద ఎత్తున చర్చగా మారింది. ఈ నేపథ్యంలో ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటాకు నోటీసుుల జారీ చేసినట్లు తెలుస్తోంది.

Next Story