రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

by Jakkula.Mamatha |

మండలంలోని సలాబత్‌పూర్ చెక్‌పోస్టు వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
X

దిశ,మద్నూర్: మండలంలోని సలాబత్‌పూర్ చెక్‌పోస్టు వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సలాబత్‌పూర్ గ్రామానికి చెందిన ప్రకాశ్(44) చెక్‌పోస్టు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రకాశ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని 108 అంబులెన్స్‌లో మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రకాశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు.

Next Story