- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహేష్ కోసం స్పెషల్ ప్లాన్ చేసిన శ్రీనివాస మంగాపురం యూనిట్
మహేష్ బాబు కోసం 'శ్రీనివాస మంగాపురం' మేకర్స్ ప్రత్యేకంగా స్పెషల్ షో ప్లాన్ చేసినట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: టాలెంటెడ్ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ సినిమా జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు కోసం చిత్ర బృందం ప్రత్యేక ప్లాన్ చేసినట్లు సమాచారం. సినిమా విడుదలకు ముందే ఘట్టమనేని కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక ప్రీమియర్ షో ఏర్పాటు చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే రోజు మహేష్ బాబుకు కూడా సినిమా చూపించాలని భావించినప్పటికీ, ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా మరో రోజు ప్రత్యేకంగా స్పెషల్ షో నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మొదటి స్పెషల్ షోకు ఘట్టమనేని కుటుంబ సభ్యులతో పాటు చిత్ర బృందం కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ చిత్రంలో రషా తడానీ హీరోయిన్‌గా నటించగా, మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాను ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, పద్మాలయ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.






