Vice Presidential Elections: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్లు నేటి నుంచి ప్రారంభం

by Gopi |
Nomination Process For Vice Presidential Elections begins today
X

దిశ,వెబ్‌డెస్క్: Nomination Process For Vice Presidential Elections begins today| రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థుల కోసం కసరత్తు జరుగుతుండగానే మరోవైపు ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అందులో భాగంగానే ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు ఉప రాష్ట్రపతి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం నుంచి మొదలవుతున్నట్లు వెల్లడించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్టు 10వ తేదీతో ముగియనుంది. కాగా ఉప రాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ పత్రాలు జూలై 19 వరకు స్వీకరించనున్నారు.

జూలై 20న నామినేషన్ పత్రాల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు జూలై 22 చివరి తేది అని తెలిపింది. ఇకపోతే రాజకీయ పార్టీలు ఇంకా ఉప రాష్ట్రపతి ఎన్నికలకు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంటు ఉభయ సభల్లో మొత్తం 788 మంది సభ్యులు ఉన్నారు. 233 మంది రాజ్యసభ సభ్యులతోపాటు 12 మంది నామినేటెడ్ సభ్యులు, 543 మంది లోక్ సభ ఎంపీలతో కలుపుకుని మొత్తం 788 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇక ఆగస్టు 6న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగగా, అదే రోజు ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంటుంది. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్‌పర్సన్‌గా వ్యవహారిస్తారు.

Next Story

Most Viewed