BREAKING : బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం

by Rajesh |   ( Updated:2024-06-17 07:03:35.0  )
BREAKING : బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని న్యూజలపాయ్ గురిలో రెండు రైళ్లు ఒకదానినొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం ఉదయం 9 గంటలకు రైలునంబర్ 13174 కాంచన‌జంగ ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాలోని సెల్దాకు బయల్దేరిన కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్ మధ్యలో న్యూజల్‌పాయ్‌గుడి వద్ద ఆగింది. అక్కడి నుంచి బయల్దేరిన కాసేపటికి రంగపాని స్టేషన్ సమీపంలో వెనక నుంచి ఓ గూడ్స్ రైలు ఢీకొట్టింది. సిగ్నల్ జంప్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రెడ్ సిగ్నల్ వేసినా గూడ్స్ రైలు పట్టించుకోకుండా వెళ్లినట్లు అధికార వర్గాలు తెలిపాయి. క్షతగాత్రులను హుటాహుటిన సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

రైలు ప్రమాద ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంచనజంగ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొట్టాయని తెలిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం ప్రమాద వార్త తెలియగానే రైల్వే డీఎం, ఎస్పీ, డాక్టర్లు, అంబులెన్సులు, డిజాస్టర్ టీమ్స్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధ ప్రతిపాదికన సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కాగా ఈ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రమాద స్థలంలో రైలు ఇంజన్ ఢీకొనడంతో బోగీ గాల్లో వేలాడగా మరికొన్ని బోగీలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed