- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్‌వి మతిలేని మాటలు: పొంగులేటి సీరియస్
సీఎం రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ మాట్లాడుతున్న భాష సరిగా లేదని, మతి లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ మాట్లాడుతున్న భాష సరిగా లేదని, మతి లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు వ్యక్తిగతంగా తాను రిఫరెండంగా భావిస్తున్నానని అన్నారు. ఇప్పటికే రెండు సార్లు కేటీఆర్ రిఫరెండం అన్నారు. మళ్లీ ఇప్పుడు రిఫరెండం అంటున్నారు. ఇంతకు ముందు జరిగిందే ఈ ఎన్నికల్లో జరుగుతుందన్నారు. ఆనాడు సోయి లేకుండా ఇష్టం వచ్చినట్లు జిల్లాలను ఏర్పాటు చేసి, ఇప్పుడు అగ్నిగుండం చేస్తామని మతిలేని మాటలు మాట్లాడుతున్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో ప్రజామోదంతో జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేస్తామన్నారు. బట్ట కాల్చి మీద వేయడమే ప్రతి పక్ష పార్టీ పని అన్నట్లుగా వ్యవహరిస్తోందన్నారు. తమ రెండేళ్ల పాలనలో ఏ తప్పు జరిగిందని మాట్లాడుతున్నారు. వారి పాలనలో అక్రమాలు జరిగినట్లుగానే ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నాయని భ్రమపడుతున్నారు. ఇంకా అధికారంలో ఉన్నట్లుగా వారి వ్యవహార శైలి ఉందన్నారు. అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని చిట్ చాట్‌లో అన్నారు.
READ MORE .....






