చిరంజీవి, నా కొడుకు అందుకే దావోస్ వ‌చ్చారు.. పొంగులేటి కీల‌క వ్యాఖ్య‌లు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-24 15:43:24  IST  )

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. చిట్ చాట్ లో ఆయ‌న మాట్లాడుతూ.. దావోస్ ప‌ర్య‌ట‌న‌కు త‌న కొడుకు రావ‌డంపై ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అన్నారు.

చిరంజీవి, నా కొడుకు అందుకే దావోస్ వ‌చ్చారు.. పొంగులేటి కీల‌క వ్యాఖ్య‌లు
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. చిట్ చాట్ లో ఆయ‌న మాట్లాడుతూ.. దావోస్ ప‌ర్య‌ట‌న‌కు త‌న కొడుకు రావ‌డంపై ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అన్నారు. త‌న కుమారుడు బిజినెస్ ప‌నిమీద‌నే దావోస్ వ‌చ్చార‌ని చెప్పారు. త‌న కుమారుడు, మెగాస్టార్ చిరంజీవి కూడా అందుకోస‌మే వ‌చ్చార‌న్నారు. వాళ్లిద్ద‌రికి ప్ర‌భుత్వం ఒక్క రూపాయి కూడా ఖ‌ర్చు పెట్ట‌లేద‌ని అన్నారు. త‌న కుమారుడిపై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని, త‌న‌పై భూ ఆరోప‌ణ‌లు చేస్తున్నారని అన్నారు.

ఈడీ కేసుల గురించి మాట్లాడ‌టం త‌ప్ప మ‌రొక‌టి ఏం లేద‌న్నారు. తాను ఎలాంటి క‌బ్జాల‌కు పాల్ప‌డ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. భూభార‌తిలో రూ.3.9 కోట్ల రిజిస్ట్రేష‌న్ టాక్స్ అక్ర‌మాలు జ‌రిగాయ‌న్నారు. ప్ర‌తి మండ‌లాన్ని యూనిట్ గా తీసుకుని కేసులు న‌మోదు చేశామ‌ని చెప్పారు. ధరణి అక్రమాలపై సిద్దిపేట, సిరిసిల్లలో కేరళ సంస్థ ఆడిట్ చేస్తోందని అన్నారు. నైని కోల్ మైన్స్ టెండ‌ర్లు రాక‌ముందే అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అంతే కాకుండా ఫోన్ ట్యాపింగ్ లో ఎవ‌రు ఉన్నా విచార‌ణ‌కు రావాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు.

READ MORE .....

కేటీఆర్‌వి మ‌తిలేని మాట‌లు: పొంగులేటి సీరియస్

సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో అక్రమాలు.. ఎవరినీ వదలమని పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హెచ్చరిక

Next Story