- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్‌ఎఫ్‌ఐ 24 గంటల దీక్ష భగ్నం.. విద్యార్థి నాయకుల అరెస్ట్
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ (SFI) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన 24 గంటల నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ (SFI) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన 24 గంటల నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విద్యా వ్యవస్థలో నెలకొన్న సంక్షోభం, ఎన్టీఏ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థి ఉద్యమాలకు సంఘీభావంగా నిర్వహించిన ఈ దీక్షను సీపీఎం నాయకులు జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రారంభించారు. అయితే, ఈ నిరసనను పోలీసులు అడ్డుకోని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు, ఉపాధ్యక్షులు ఎం. మమత, డి. కిరణ్, కె. అశోక్ రెడ్డి సహా పలువురు నేతలను అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శాంతియుత దీక్షపై పోలీసుల చర్యను ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా అభివర్ణించిన విద్యార్థి నేతలు, విద్యారంగ పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.






