- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's Horoscope:ఈ రోజు(జులై 21) రాశి ఫలాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జులై 21, 2026 మంగళవారం నాటి ద్వాదశ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జులై 21, 2026 మంగళవారం నాటి ద్వాదశ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..
మేష రాశి
ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. నూతన ప్రాజెక్టులు చేపట్టడానికి మంచి రోజు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్య విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు అవసరం, ముఖ్యంగా ఆహార నియమాలు పాటించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి ఆరాధన శ్రేయస్కరం.
వృషభ రాశి
ఈ రాశి వారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. రావలసిన ధనం చేతికి అందుతుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.కుటుంబంలో ఉత్సాహపూరిత వాతావరణం ఉంటుంది. ప్రయాణాల వల్ల కొద్దిగా అలసట కలగవచ్చు. నవగ్రహ శ్లోకాలు పఠించడం మంచిది.
మిథున రాశి
సమయానుకూలంగా పనులు పూర్తవుతాయి. సహోద్యోగుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఊహించని ధన లాభం కలిగే అవకాశం ఉంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.విష్ణు సహస్రనామ పారాయణ అనుకూలిస్తుంది.
కర్కాటక రాశి
పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అనవసర వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ పెద్దల సలహా తీసుకోండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. శివారాధన లేదా మృత్యుంజయ మంత్రం జపించడం శుభకరం.
సింహ రాశి
మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగార్థులకు నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపార లాభాలు మెండుగా ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించడం అత్యంత శ్రేయస్కరం.
కన్య రాశి
పనుల్లో కొద్దిపాటి జాప్యం జరిగినా చివరికి విజయం సాధిస్తారు. ఆర్థిక సంబంధిత విషయాల్లో జాగ్రత్త వహించండి.తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, తగినంత విశ్రాంతి తీసుకోండి. లక్ష్మీదేవి పూజ లేదా వెంకటేశ్వర స్వామి దర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది.
తుల రాశి
వృత్తి రీత్యా శుభవార్తలు వింటారు. కొత్త ఆదాయ మార్గాలు సుగమం అవుతాయి. వ్యాపారులకు లాభదాయకమైన రోజు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అమ్మవారిని దర్శించుకోవడం శుభప్రదం.
వృశ్చిక రాశి
ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మంగళవారం కాబట్టి హనుమాన్ చాలీసా పఠించడం విశేష ఫలాన్ని ఇస్తుంది.
ధనుస్సు రాశి
ముఖ్యమైన పనులు నెరవేరుతాయి. బకాయిలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు రచిస్తారు. పిల్లల విషయమై శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దక్షిణామూర్తి లేదా రాఘవేంద్ర స్వామి ఆరాధన మేలు చేస్తుంది.
మకర రాశి
పని ప్రదేశంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తత అవసరం. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. సరియైన ఆహార అలవాట్లు పాటించండి. శని దేవుడిని లేదా రుద్ర నామాన్ని జపించడం మంచిది.
కుంభ రాశి
నూతన పరిచయాలు ఏర్పడతాయి. పనులు వేగవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లేదా సానుకూల మార్పుల సూచనలు ఉన్నాయి. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. గణపతి హోమం లేదా సంకటనాశన గణేశ స్తోత్రం పఠించండి.
మీన రాశి
ఈ రాశి వారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ దానికి తగినట్లుగా ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. గాయత్రి మంత్రం పఠించడం అత్యంత శ్రేయస్కరం.






