సేవా కార్యక్రమాలతో సమాజంలో వెలుగులు నింపాలి: ఎమ్మెల్యే

by Taduka Kalyani |

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలో రోడ్డు పక్కన, ప్రధాన కూడళ్లలో చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు గొడుగులు పంపిణీ చేశారు.

సేవా కార్యక్రమాలతో సమాజంలో వెలుగులు నింపాలి: ఎమ్మెల్యే
X

దిశ, హనుమకొండ కలెక్టరెట్ : హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలో రోడ్డు పక్కన, ప్రధాన కూడళ్లలో చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు గొడుగులు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ ఆధ్వర్యంలో హసన్‌పర్తిలోని మహాలక్ష్మి బ్యాంకెట్ హాల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి, హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దిలీప్ రాజ్‌లతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు హాజరై చిరు వ్యాపారులకు గొడుగులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాకాలంలో ఎండ, వానలను లెక్కచేయకుండా రోడ్ల పక్కన వ్యాపారాలు నిర్వహించే చిరు వ్యాపారులకు కొంత ఉపశమనం కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు రోజంతా కష్టపడి జీవనం సాగిస్తున్న నేపథ్యంలో వారికి నీడ కల్పించడం గొప్ప సేవా కార్యక్రమమని పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ గతంలో కూడా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ, ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ వంటి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. సమాజానికి ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలను భవిష్యత్‌లో చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు సోమ వేణుగోపాల్, కార్యదర్శి నాయిని అనిల్ కుమార్, కోశాధికారి జూలూరి కృష్ణమూర్తి, కాంగ్రెస్ నాయకులు కోరే చంద్రమౌళి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పింగిలి వేణుగోపాల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు గొర్రె కిరణ్, ఏనుమాముల మార్కెట్ డైరెక్టర్ రైతు రాజు, వంగపహాడ్ పీఏసీఎస్ చైర్మన్ మెరుగు రాజేష్ గౌడ్, 65వ డివిజన్ అధ్యక్షుడు సునీల్, సీనియర్ నాయకులు తోకాల లక్ష్మారెడ్డి, కనపర్తి కిరణ్, వీసం సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story