ప్రతిరైతు ఫామ్ పాండ్‌ల నిర్మాణానికి ముందుకు రావాలి..

by Batti.Sumithra |

ప్రతి రైతు ఫామ్ పాండ్‌ల నిర్మాణానికి ముందుకు రావాలని, అలాగే మారుమూల గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు.

ప్రతిరైతు ఫామ్ పాండ్‌ల నిర్మాణానికి ముందుకు రావాలి..
X

దిశ, బైంసా : ప్రతి రైతు ఫామ్ పాండ్‌ల నిర్మాణానికి ముందుకు రావాలని, అలాగే మారుమూల గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. మంగళవారం కుంటాల మండలంలోని అంబుగాం గ్రామంలో పర్యటించారు. గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉన్న నేపథ్యంలో గ్రామపంచాయతీ తీర్మానం చేసి ప్రతిపాదనలు పంపితే వెంటనే నూతన బోరుబావి మంజూరు చేస్తామని తెలిపారు.

బోరుబావి ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని, ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలించి అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామంలో టెలికాం సేవల మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూగర్భ జలాల పరిరక్షణలో ప్రతి గ్రామస్థుడు భాగస్వామి కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, డీపీఓ శ్రీనివాస్, డీఆర్‌డీఓ విజయలక్ష్మి, ఈఈ ఆర్‌డబ్ల్యూఎస్ సందీప్, తహసీల్దార్ కమల్ సింగ్, ఎంపీడీఓ వనజ, సర్పంచ్ శివాజీ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story