- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధర్మారంలో కేటీఆర్‌కు ఘన స్వాగతం..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ధర్మారం మండలంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

దిశ, ధర్మారం: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ధర్మారం మండలంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా లక్షేటిపేటలో నిర్వహించిన రైతు సదస్సుకు వెళ్తున్న సందర్భంగా ధర్మారం మండల కేంద్రంలో ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. కరీంనగర్ నుంచి ధర్మారం చేరుకున్న కేటీఆర్‌కు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. మహిళలు బతుకమ్మలతో ఆహ్వానం పలకగా, పార్టీ కార్యకర్తలు "సీఎం.. సీఎం.." అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా స్వాగతించారు. కేటీఆర్ కార్యకర్తలకు అభివాదం చేస్తూ పలకరించగా,ఆయన రాకతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. అనంతరం ఆయన లక్షేటిపేటలో నిర్వహించిన రైతు సదస్సుకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ధర్మారం బీఆర్ఎస్ నాయకులు ముత్యాల బలరాం రెడ్డి, రాచూరి శ్రీధర్‌తో పాటు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






