- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడవుల్లో డ్రోన్లతో విత్తనాలు.. ఫారెస్ట్ అధికారుల ఐడియా అదుర్స్
శ్రీశైలం అడవుల్లో వృక్ష సంపద పెంపే లక్ష్యంగా ఫారెస్ట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అడవిలో వృక్ష సంపదను పెంచేందుకు 130 హెక్టార్ల పరిధిలో డ్రోన్ సహాయంతో లక్ష సీడ్ బాల్స్ చల్లారు.

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం అడవుల్లో వృక్ష సంపద పెంపే లక్ష్యంగా ఫారెస్ట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అడవిలో వృక్ష సంపదను పెంచేందుకు 130 హెక్టార్ల పరిధిలో డ్రోన్ సహాయంతో లక్ష సీడ్ బాల్స్ చల్లారు. ఈ మేరకు ఫారెస్ట్ అధికారులు పరమేశులు, మదన్ కుమార్ మాట్లాడుతూ.. అడవిలో మేడి, రావి, వేప వృక్షాల విత్తనాలు చల్లినట్టు తెలిపారు. సాధారణంగా అడవుల్లో జంతువులకు అవసరం అయ్యే వృక్ష సంపద లేకపోవడం వల్ల అవి జనావాసాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కోతులు మేడిపల్లు, రావి పల్లు తింటూ అడవుల్లో జీవిస్తాయి. కానీ ఆ వృక్షాలు తక్కువగా ఉండటం వల్ల జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇతర జంతువులు కూడా అలానే వస్తున్నాయి. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ తీసుకున్న ఈ నిర్ణయంతో వృక్ష సంపద పెరగటంతో పాటు జంతువులకు కావాల్సిన ఆహారం సైతం దొరుకుంది. దీనివల్ల పక్షులు, జంతువులకు ఆహారం కొరత తగ్గి అడవులు కలకలలాడే అవకాశం ఉంది.






