- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటి నుంచే ‘ఇందిరమ్మ ఇండ్లు’ దరఖాస్తులు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు పథకానికి దరఖాస్తుల స్వీకరణ మంగళవారం నుంచి అధికారికంగా ప్రారంభమైంది.

దిశ, హైదరాబాద్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు పథకానికి దరఖాస్తుల స్వీకరణ మంగళవారం నుంచి అధికారికంగా ప్రారంభమైంది. అర్హులైన ప్రతి పేద కుటుంబం ఎలాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తు చేసుకునేలా మీ సేవ కేంద్రాలుతో పాటు మీ సేవ వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దరఖాస్తుల స్వీకరణ జూలై 21 నుంచి ఆగస్టు 10, 2026 వరకు కొనసాగనుంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఈ సేవలను ప్రారంభించిన ప్రభుత్వం, దరఖాస్తు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, సులభంగా నిర్వహించేలా చర్యలు చేపట్టింది. క్యూర్ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులు తమ సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సందర్శించి లేదా 8096958096 నంబర్‌కు వాట్సాప్‌లో “Hi” అని సందేశం పంపి చాట్‌బాట్ సూచనల మేరకు నేరుగా మొబైల్ ఫోన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ మరింత వేగవంతం...
దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు వివరాలతో పాటు అవసరమైన పత్రాల స్కాన్ కాపీలు లేదా స్పష్టమైన ఫోటోలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. అలాగే మీ సేవ పోర్టల్, వాట్సాప్ ద్వారా దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కూడా కల్పించారు. ఈ డిజిటల్ విధానం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గడంతో పాటు, పేపర్‌వర్క్‌కు స్వస్తి పలికి, దరఖాస్తు ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ప్రజలకు ప్రభుత్వ సేవలను ఇంటి వద్దకే చేరవేయాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగంగానే ఈ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అర్హులైన పౌరులు ఆగస్టు 10లోపు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని, చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు సమర్పించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. దరఖాస్తు విధానాన్ని వివరించే ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేసినట్లు తెలిపారు.






