పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదతో ప్రవర్తించాలి

by Batti.Sumithra |

పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదగా ప్రవర్తించాలని రామగుండం సీపీ అంబటి కిషోర్ పోలీసు అధికారులకు సూచించారు.

పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదతో ప్రవర్తించాలి
X

దిశ, చెన్నూర్ : పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదగా ప్రవర్తించాలని రామగుండం సీపీ అంబటి కిషోర్ పోలీసు అధికారులకు సూచించారు. మంచిర్యాల జిల్లా భీమారం పోలీస్ స్టేషన్ ను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను సందర్శించి విధులు నిర్వహిస్తున్న పోలీసుల పనితీరును సమీక్షించారు. పోలీస్ స్టేషన్ లోని రికార్డులను తనిఖీ చేసి ఆన్లైన్ ప్రక్రియలో నమోదు చేస్తున్న పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాల వివరాలను శాంతి భద్రత ల పరిస్థితులు గ్రామాల పరిస్థితుల పై ఎస్సై రాజేందర్ తో చర్చించారు. మాదకద్రవ్యాల పై, గ్రామాలలో గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తుంటే వారి పై నిఘా పెట్టాలని ఆయన సూచించారు.

Next Story