- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాక్సాఫీసు వద్ద బిగ్ ఫైట్.. సూర్యతో పోటీకి దిగుతున్న లేడీ సూపర్ స్టార్
ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ ఫైట్ జరగబోతోంది.

దిశ, సినిమా: ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ ఫైట్ జరగబోతోంది. గతంలో పలు విజయవంతమైన సినిమాల్లో జంటగా నటించి మెప్పించిన వర్సటైల్ హీరో సూర్య, లేడీ సూపర్ స్టార్ నయనతార.. ఈసారి బాక్సాఫీస్ బరిలో ప్రత్యర్థులుగా పోటీ పడుతుండటం విశేషం. సూర్య నటిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, నయనతార నటిస్తున్న ‘హాయ్’ సినిమాలు రెండూ ఒకే రోజు.. అంటే ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతున్నాయి.నయనతార ప్రధాన పాత్రలో వస్తున్న ‘హాయ్’ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ శిష్యుడు విష్ణు ఏడవన్ తెరకెక్కిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో కవిన్ హీరోగా నటిస్తున్నారు. భాగ్యరాజ్, రాధికా శరత్ కుమార్, ప్రభు, అమృత శ్రీనివాస్, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతోంది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఒకే రోజు ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులు విడుదలవుతుండటంతో సినీ ప్రియుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.






