- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా రక్తం కావాలంటే ఇస్తాం.. మా రైతులకు సాగునీరు ఇవ్వండి: మాజీ ఎమ్మెల్యే
మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్షన్ రెడ్డి జొన్నల బొగుడ రిజర్వాయర్ ను పరిశీలించి రైతులతో మాట్లాడారు.

దిశ, పెద్దకొత్తపల్లి: మా రక్తం కావాలంటే ఇస్తాం.. కానీ మా రైతులకు సాగు నీరు ఇవ్వండని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్షన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమ వారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్షన్ రెడ్డి పెద్ద కొత్తపల్లి మండలం జొన్నలబొగుడ రిజర్వాయర్ లో ఉన్న నీటి నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్ లో నీటి నిల్వ ఉన్న రైతులకు సాగునీరు అందించని ప్రభుత్వం అలసత్వం పట్ల తీవ్రంగా ఖండించారు. వారం రోజుల్లో నీరు విడుదల చెయ్యక పోతే రైతులతో కలిసి మేమే నీటిని విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి మాకు రైతుల సాగునీటి కష్టాలు తీర్చడమే మా లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్షన్ రెడ్డి స్పష్టం చేశారు. జొన్నలబొగుడ రిజర్వాయర్ నుంచి రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ఎస్ నాయకులు సింగిల్ విండో మాజీ చైర్మన్ కట్టా రాజేందర్ గౌడ్, విండో మాజీ వైస్ ఛైర్మన్ రాము యాదవ్, మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు నాగరాజు,లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్, రవి నాయక్ పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు ,తదితరులు పాల్గొన్నారు.






