- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KCR: అమ్మ.. బాగున్నరా! మంత్రులను ఆత్మీయంగా పలుకరించిన KCR
తెలంగాణ రాజకీయాల్లో అరుదైన, ఆహ్లాదకరమైన పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి, సంప్రదాయానికి పట్టం కడుతూ రాష్ట్ర మంత్రులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో అరుదైన, ఆహ్లాదకరమైన పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి, సంప్రదాయానికి పట్టం కడుతూ రాష్ట్ర మంత్రులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha), పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క (Danasari Seethakka) ఇవాళ సాయంత్రం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. వారికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ (Santhosh Kumar) సాదర స్వాగతం పలికారు. త్వరలో జరగబోయే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం ‘సమ్మక్క-సారలమ్మ మహా జాతర’కు ప్రభుత్వం తరఫున హాజరు కావాలని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ దంపతులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రులు గులాబా బాస్‌కు శాలువా కప్పి, జాతర ఆహ్వాన పత్రికతో పాటు మేడారం ప్రసాదాన్ని అందజేశారు
తెలంగాణ సంప్రదాయంతో సత్కారం..
అయితే, తమ నివాసానికి వచ్చిన మహిళా మంత్రులకు కేసీఆర్, శోభమ్మ దంపతులు ఘనస్వాగతం పలికారు. కేవలం రాజకీయ నాయకులుగానే కాకుండా, ఇంటికి వచ్చిన ఆడబిడ్డలుగా భావించి వారికి పసుపు, కుంకుమ, వస్త్రాలు, తాంబూలాలను అందజేసి సంప్రదాయబద్ధంగా సత్కరించారు. అనంతరం వారితో కలిసి తేనీటి విందు స్వీకరించి, కాసేపు ఇష్టాగోష్టిగా యోగక్షేమాలు చర్చించారు. అనంతరం మంత్రులు అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.కాగా, ప్రజాస్వామ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఉండాల్సిన హుందాతనాన్ని ఈ భేటీ ప్రతిబింబించిందని పలువురు కామెంట్ చేస్తున్నారు.
Read More... ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ని కలవనున్న కాంగ్రెస్ మంత్రులు..! ఎందుకంటే?






