- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ని కలవనున్న కాంగ్రెస్ మంత్రులు..! ఎందుకంటే?
ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇవాళ (గురువారం) మధ్యాహ్నం కాంగ్రెస్ మంత్రులు భేటీ కానున్నట్లు సమాచారం.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇవాళ (గురువారం) మధ్యాహ్నం కాంగ్రెస్ మంత్రులు భేటీ కానున్నట్లు సమాచారం. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ & అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, సీతక్క మాజీ సీఎం కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలవనున్నారు. ఈ సందర్భంగా మేడారం మహా జాతరకు రావాలని కోరుతూ కేసీఆర్‌కు ఆహ్వాన పత్రికను మంత్రులు అందజేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
సంక్రాంతి సెలవులతో భారీ సంఖ్యలో భక్తులు!
కాగా, ఈ నెల జనవరి 28న ప్రారంభమై 31న ముగియనున్న మేడారం మహా జాతరకు ఇప్పటికే సన్నాహాలు జోరుగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి సెలవులు కూడా సమీపించడంతో ఈసారి జాతరకు ముందుగానే భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహా జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు హాజరుకానున్నారు.
మేడారం మహా జాతరను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని, జాతర నిర్వహణకు భారీగా నిధులు కేటాయించింది. జాతర జరిగే ప్రాంతంతో పాటు పరిసర గ్రామాల్లో కూడా మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపట్టగా, ప్రస్తుతం అవి వేగవంతంగా కొనసాగుతున్నాయి. భద్రత, రవాణా, తాగునీరు, వైద్య సదుపాయాల ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఈసారి మేడారం మహా జాతర మరింత వైభవంగా జరగనుందని అధికారులు పేర్కొంటున్నారు.
Read More.. T Congress: వారి పేర్లు బయటపెడుతా.. సొంత పార్టీ నేతల తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్ వైఖరి మార్చుకో.. లేదంటే బీఆర్ఎస్ కనుమరుగవ్వడం ఖాయం : దానం నాగేందర్






