కేటీఆర్ వైఖరి మార్చుకో.. లేదంటే బీఆర్ఎస్ కనుమరుగవ్వడం ఖాయం : దానం నాగేందర్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-08 07:45:25  IST  )

కేటీఆర్ అహంకారం వల్లే బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం జరుగుతోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు.

కేటీఆర్ వైఖరి మార్చుకో.. లేదంటే బీఆర్ఎస్ కనుమరుగవ్వడం ఖాయం : దానం నాగేందర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్ అహంకారం వల్లే బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం జరుగుతోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలపై ఆయన వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని సూచించారు. కేటీఆర్ కావాలనే రేవంత్ తో కయ్యం పెట్టుకుంటున్నారని, వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ పోతే కేటీఆర్ కే నష్టమని పేర్కొన్నారు. కేటీఆర్ అహంకార ధోరణి వల్లనే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు.

బీఆర్ఎస్ కనుమరుగవ్వడం ఖాయం

దిగజారుడు రాజకీయాలు చేసి.. కేటీఆర్ లబ్ధి పొందాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. పాలనాపరమైన అంశాలపై మాట్లాడితే.. రాష్ట్ర ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అంతేకాని అసభ్య పదజాలంతో మాట్లాడటం వల్ల పరస్పర విమర్శలు పెరుగుతాయన్నారు. కేటీఆర్ ఒకటి అంటే.. సీఎం రేవంత్ 10 అంటారని, దీనివల్ల బీఆర్ఎస్ కే డ్యామేజ్ ఎక్కువ జరుగుతుందని సూచించారు. ఇప్పటికైనా కేటీఆర్ వైఖరి మార్చుకోకపోతే.. ఇదే పునరావృతమవుతూ ఉంటుందని.. భవిష్యత్ లో బీఆర్ఎస్ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు.

Read More.. ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ని కలవనున్న కాంగ్రెస్ మంత్రులు..! ఎందుకంటే?

Ponguleti: దమ్ముంటే ఖమ్మంలో ఎక్కడ పోటీ చేస్తావో చేయు.. కేటీఆర్ కు మంత్రి పొంగులేటి చాలెంజ్

Next Story