- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ponguleti: దమ్ముంటే ఖమ్మంలో ఎక్కడ పోటీ చేస్తావో చేయు.. కేటీఆర్ కు మంత్రి పొంగులేటి చాలెంజ్
మూడుసార్లు ముక్కు నేలకు రాసినా కేసీఆర్ తరం కాలేదని ఇక కేటీఆర్ తో ఏమవుతుందని మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) చాలెంజ్ విసిరారు. కేటీఆర్‍కు (KTR) దమ్ముంటే ఖమ్మం జిల్లాలో వచ్చి పోటీ చేయాలని సవాల్ చేశారు. జిల్లా పర్యటనలో వచ్చి గొప్పలు మాట్లాడటం కాదని దమ్ముంటే తన చాలెంజ్ స్వీకరించాలన్నారు. ఇవాళ ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడిన పొంగులేటి నిన్న కేటీఆర్ ఖమ్మం (Khammam Politics) టూర్‍పై స్పందించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరినో గెలిపించడం కాదు నువ్వే వచ్చి ఎక్కడి నుంచి బరిలోకి దిగుతావో దిగు. ముక్కు నేలకు రాసినా ఉమ్మడి ఖమ్మంలో గెలవడం మీ నాయిన తరమే కాలేదని ఇక నీ వల్ల ఏమవుతుందని విమర్శించారు. కేటీఆర్ ముందు తన ఇంట్లో సమస్యను పరిష్కరించుకోవాలని హితవు పలికారు.
ఆరు నెలలకే ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేశారు:
రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన ఆరు నెలలకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారని మంత్రి సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం జోలికి వస్తే కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటో చూపిస్తామన్నారు. కేటీఆర్ మతి భ్రమించి రాహుల్ గాంధీపై, గాంధీ కుటుంబంపై మాట్లాడుతున్నారని, సూర్యూడి పైకి ఉమ్మితే అది తిరిగి తన ముఖం మీదే పడుతుందనే విషయాన్ని కేటీఆర్ మర్చిపోతున్నారన్నారు. అవినీతి, అక్రమాలు, దోపిడీలకు పేటెంట్‍గా ఉన్న కల్వకుంట్ల ఫ్యామిలీ గాంధీ కుటుంబం గురించా మాట్లాడేది అని మండిపడ్డారు. జాతీయ నాయకుడిని విమర్శిస్తే తాను జాతీయ నాయకుడిని అవుతానని తాపత్రయపడటం తప్పులేదు కానీ ఆశకు కూడా హద్దు ఉండాలన్నారు. ఎన్నికల్లో ప్రజలు వరుసగా దెబ్బకొట్టినా బుద్ది తెచ్చుకోకుండా అవాక్కులు చేవాకులు పేలుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఎన్నికలైతే మీరు రెఫరెండం అని చెప్పారో ఆ ఎన్నికల్లోనే మీకు ప్రజలు గూబగుయ్యిమనిపించారు. జూబ్లీహిల్స్, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికలను సెమీ ఫైనల్స్ అంటున్నారు. దేనికి సెమి ఫైనల్? ప్రశ్నించారు.
Read More..






