- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ చీరలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది: మంత్రి సీతక్క
తెలంగాణ మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ మేడారం మహాజాతరకు మాజీ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లిన మంత్రులు స్వయంగా కేసీఆర్‌కు మేడారం ఆహ్వానపత్రికను అందజేశారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ మేడారం మహాజాతరకు మాజీ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లిన మంత్రులు స్వయంగా కేసీఆర్‌కు మేడారం ఆహ్వానపత్రికను అందజేశారు. అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో కేసీఆర్‌ను కలవలేకపోయామని అందుకే నివాసానికి వెళ్లి మేడారం జాతరకు ఆహ్వానించామని చెప్పారు. తనతో పాటు తన అక్క కొండా సురేఖ మరికొందరు నేతలతో కలిసి వెళ్లి ఆహ్వానించామన్నారు. దీనికి ఎలాంటి రాజకీయాలు లేవని ఇది ఒక ఆచారం అని చెప్పారు.
కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభమ్మను ఆహ్వానించామని వారికి దేవుడి తరపున పట్టు వస్త్రాలు పెట్టామని చెప్పారు. కేసీఆర్ దంపతులు సైతం తమకు చీరలు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఇది రాజకీయాలు మాట్లాడుకునే సమయం కాదన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర అని అన్నారు. ప్రాంతాలకు అతీతంగా అందరికోకలు తీర్చే తల్లులు సమ్మక్క సారలమ్మ అని కొనియాడారు. ఇక మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. కేసీఆర్ జాతరకు వస్తానని చెప్పారన్నారు. ఏదో ఒకరోజు హెలికాప్టర్ లో జాతరకు వస్తానని చెప్పారన్నారు.






