రామ్ 'RAPO23'లో విలన్‌గా ఆ బాలీవుడ్ స్టార్ నటుడు!

by Pulgam srinivas |

'RAPO23'లో విలన్‌గా బాలీవుడ్ సీనియర్ స్టార్ జాకీ ష్రాఫ్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రామ్ RAPO23లో విలన్‌గా ఆ బాలీవుడ్ స్టార్ నటుడు!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం 'RAPO23' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ హీరోగా నటించడమే కాకుండా, స్వయంగా కథను అందించి దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలోని విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ నటుడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. హిందీ సినీ పరిశ్రమలో విశేష గుర్తింపు పొందిన సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్‌ను విలన్ పాత్రకు ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో సంయుక్త మీనన్ ను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story