- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒమన్‌లో హైదరాబాద్ మహిళకు యజమాని నరకం.. భారత రాయబార కార్యాలయం స్పందన ఇదే
నెలకు 50 వేల జీతం అని ఒమన్ వెళ్లిన హైదరాబాద్ మహిళను అక్కడి యజమాని చిత్రహింసలకు గురి చేయడం కలకలం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏజెంట్ మాటలు నమ్మి ఉపాధి నిమిత్తం ఓమన్ కు వెళ్లిన ఓ హైదరాబాద్ మహిళ అక్కడ తన యజమాని చేతిలో చిత్రహింసలకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. గత మూడు నెలలుగా జీతం ఇవ్వకుండా తన చేత రాత్రింబవళ్లు బలవంతంగా పని చేయిస్తూ వేధిస్తున్నారని తనను ఎలాగైనా కాపాడాలంటూ కంటతడిపెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధితురాలి ఆవేదనను ఎంబీటీ పార్టీ నాయకుడు అమ్జద్ ఉల్లా ఖాన్ ‘ఎక్స్’లో పోస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై తాజాగా మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం సానుకూలంగా స్పందించింది. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణించామని, తగిన స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని ఎంబసీ అధికారులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
అసలేం జరిగిందంటే?
హైదరాబాద్‌కు చెందిన షబ్నమ్ బేగం (26) అనే మహిళకు మస్కట్‌లో హౌస్‌మెయిడ్ (గృహ కార్మికురాలు) ఉద్యోగం ఇప్పిస్తామని, నెలకు 200 ఒమానీ రియాల్స్ (సుమారు రూ. 50,000) జీతం ఇస్తామని స్థానిక రిక్రూట్‌మెంట్ ఏజెంట్ నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మిన షబ్నమ్ బేగంఈ ఏడాది మార్చి 26న ఒమన్‌కు వెళ్లింది. ఎన్నో ఆశలతో ఒమన్ లో అడుగుపెట్టిన షబ్మన్ కు అక్కడ యజమానుల తీరు పీడకలగా మారింది. పనిలో చేరాక తనకు ప్రతిరోజూ 12-15 గంటల పాటు వేర్వేరు ఇళ్లలో పని చేయమని బలవంతం చేశారని, సరైన ఆహారం, వసతి నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేసింది. నా ఫోన్ లాగేసుకున్నారని, మూడు నెలల పాటు జీతం ఇవ్వకుండా తనను శారీరకంగా మానసికంగా చిత్రహింకలకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతమైంది. యజమాని పెడుతున్న చిత్రహింసలు భరించలేక పనిచేసే ప్రదేశం నుంచి తప్పించుకొని మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నట్లు తెలిపారు. ఏజెంట్‌పై చర్యలు తీసుకోవడంతోపాటు తనను స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేయాలని వేడుకున్నారు.






