ఒడిశా టు ప్రొద్దుటూరు: గంజాయి ముఠా అరెస్ట్

by Vemula.Srinu Prasad |

ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకువచ్చి, చిన్న చిన్న ప్యాకెట్లుగా మారుస్తూ స్థానికంగా విక్రయిస్తున్న ఒక అంతర్రాష్ట్ర ముఠాను ప్రొద్దుటూరు త్రీటౌన్ పోలీసులు శనివారం చాకచక్యంగా పట్టుకున్నారు. ..

ఒడిశా టు ప్రొద్దుటూరు: గంజాయి ముఠా అరెస్ట్
X

​దిశ, కడప: ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకువచ్చి, చిన్న చిన్న ప్యాకెట్లుగా మారుస్తూ స్థానికంగా విక్రయిస్తున్న ఒక అంతర్రాష్ట్ర ముఠాను ప్రొద్దుటూరు త్రీటౌన్ పోలీసులు శనివారం చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి 4 కిలోల గంజాయితో పాటు 3 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ప్రొద్దుటూరు డీఎస్పీ విభూతి కృష్ణ వెల్లడించారు.

‘‘పక్కా సమాచారంతో మా త్రీటౌన్ పోలీసులు ప్రొద్దుటూరులో మెరుపు దాడులు నిర్వహించారు. ఒడిశా నుంచి రహస్యంగా గంజాయిని రవాణా చేసి, ఇక్కడ చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి యువతకు, ఇతరులకు విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నాం. ఈ అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించిన ఒక మహిళతో పాటు మరో ఇద్దరు పురుషులను (మొత్తం ముగ్గురిని) అరెస్ట్ చేశాం. వారి వద్ద నుంచి 4 కిలోల నాణ్యమైన గంజాయిని, విక్రయించగా వచ్చిన రూ. 3,000 నగదును సీజ్ చేశాం. యువత భవిష్యత్తును నాశనం చేసే ఇలాంటి మాదకద్రవ్యాల మూలాలను పూర్తిగా నిర్మూలించడమే మా లక్ష్యం. ​జిల్లాలో ఎక్కడైనా గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాల అమ్మకాలు, రవాణా జరుగుతున్నట్లు తెలిస్తే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతాం. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రజలంతా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం."అని డీఎస్పీ విభూతి కృష్ణ తెలిపారు.

Next Story