- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లాడ కోట మైసమ్మ ఆలయంలో వైభవంగా శాకాంబరీ అలంకరణ
తల్లాడ మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కోట మైసమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

దిశ,తల్లాడ: తల్లాడ మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కోట మైసమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమవారం అమ్మవారిని "శాకాంబరీ దేవి" గా అద్భుతంగా అలంకరించారు. వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో ఆలయ గర్భగుడిని, అమ్మవారి మూలవిరాట్టును నయనమనోహరంగా అలంకరించారు. ఈ విశేష అలంకరణను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, హారతులు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ రోజు అమ్మవారి శాకాంబరీ అలంకరణ పూజా కార్యక్రమాలకు ప్రముఖ భక్తులు ఈలప్రోలు లాలయ్యా - సుజాత కుటుంబ సభ్యులు దాతలుగా వ్యవహరించారు. దాతల కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు దాతలను శాలువాతో సత్కరించి, అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ పరిసరాలు భక్తుల రాకతో, ఆధ్యాత్మిక కోలాహలంతో సందడిగా మారాయి.






