- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమా టికెట్ రేట్ల పెంపుతో నాకు సంబంధం లేదు: మంత్రి కొమటిరెడ్డి
సినీ పరిశ్రమ వ్యవహారాలకు, టికెట్ రేట్ల పెంపునకు తాను పూర్తిగా దూరంగా ఉంటున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్ల పెంపు (Ticket rate hike)పై హట్ టాపిక్ గా చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు టికెట్ల రేట్ల పెరుగుదల ఉండదని చెప్పిన ప్రభుత్వం తాజాగా ప్రభాస్, చిరంజీవి ల సినిమాల టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ వ్యవహారంపై సినిమాటోగ్రఫి మంత్రి కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ వ్యవహారాలకు, టికెట్ రేట్ల పెంపునకు తాను పూర్తిగా దూరంగా ఉంటున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా 'పుష్ప-2' సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఆ సినిమాకు ప్రత్యేక అనుమతులు ఇచ్చి తప్పు చేశానా అని అప్పట్లో చాలా మదనపడ్డానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధతోనే బాబు వైద్య ఖర్చులు కూడా తానే భరించానని, ఆ సంఘటన తన మనసుపై చెరగని ముద్ర వేసిందని గుర్తు చేసుకున్నారు.
ఆ విషాద ఘటన తర్వాతే తాను కఠిన నిర్ణయం తీసుకున్నానని, ఇకపై టికెట్ రేట్ల పెంపు కోసం ఎవరూ తన వద్దకు రావద్దని సినీ పెద్దలకు తేల్చి చెప్పినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఆ హెచ్చరిక వల్లే ప్రస్తుతం పరిశ్రమ నుంచి ఎవరూ తనను కలవడం లేదని, ఇప్పుడు సినిమాలకు పెరిగిన టికెట్ ధరలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి వెల్లడించారు. మొత్తానికి సినిమా ఇండస్ట్రీని పట్టించుకోవడం తాను ఎప్పుడో మానేశానని, ప్రస్తుత రేట్ల వ్యవహారం తన పరిధిలో లేదని కోమటిరెడ్డి కుండబద్దలు కొట్టారు.
READ MORE .....
Komati Reddy: ఇంత విషమిచ్చి చంపేయండి.. మహిళా ఐఏఎస్ పట్ల దుష్ప్రచారంపై మంత్రి కోమటిరెడ్డ
సంక్రాంతికి ఊరెళ్తున్నారా?.. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చర్యలు






