- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతికి ఊరెళ్తున్నారా?.. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చర్యలు
సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుండి సొంత గ్రామాలకు వెళ్లే వారికి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు జరగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ(Sankranti Festival)కు హైదరాబాద్ నుండి సొంత గ్రామాలకు వెళ్లే వారికి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు జరగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ట్రాఫిక్ జామ్ కాకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాం. 12 లక్షలు వాహనాలు ఊర్లకు వెళ్తాయని బావిస్తున్నాం. గత సంవత్సరం 9 లక్షల వాహనాలు వెళ్లి వచ్చాయి. టోల్ గేట్ వద్ద భారీగా జామ్ అయితే టోల్ గేట్ వదిలేయాలని ఆదేశాలు ఇచ్చాము. గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం అయ్యింది. ఫ్యూచర్ సిటీ నుండి బందర్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం టెండర్లను పిలిస్తున్నాం. పంతంగి టోల్ గేట్(Pantangi Toll Plaza) వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ టోల్ గేట్ ఓపెన్ చేయాలని చెప్పాము. డీజీపీతో చెప్పి భద్రత ఏర్పాటు చేశాం. అంబులెన్సులు ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఆగిన వాహనాలను క్రెన్స్ సహాయంతో మూవ్ చేసేందుకు ఏర్పాటు చేశాం. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశాం. తెలంగాణ సరిహద్దు వరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
READ MORE .....
సినిమా టికెట్ రేట్ల పెంపుతో నాకు సంబంధం లేదు: మంత్రి కొమటిరెడ్డి
Komati Reddy: ఇంత విషమిచ్చి చంపేయండి.. మహిళా ఐఏఎస్ పట్ల దుష్ప్రచారంపై మంత్రి కోమటిరెడ్డి






