- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Komati Reddy: ఇంత విషమిచ్చి చంపేయండి.. మహిళా ఐఏఎస్ పట్ల దుష్ప్రచారంపై మంత్రి కోమటిరెడ్డి
నాపై ఏమైనా రాయండి తట్టుకుంటా కానీ మహిళా అధికారులపై ఇష్టమొచ్చినట్లు వార్తలు రాయొద్దని అన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రులు, మహిళా ఐఏఎస్ ఆఫీసర్ల మీద వస్తున్న ఆరోపణలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖండించారు. నాపై ఏమైనా రాయాలనుకుంటే రాయండి తట్టుకుంటా. కానీ మహిళా అధికారులపై ఇష్టమొచ్చినట్లు వార్తలు రాయొద్దని మీడియాను కోరారు. ప్రతీ ఒక్కరికీ కుటుంబం ఉంటుంది. అడ్డగోలు రాతలు మంచివి కాదన్నారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓ మహిళా ఐఏఎస్ పై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. మీడియాలో మీరంతా నా పాత మిత్రులే. నా గురించి మీ అందరికీ తెలుసు. అయినా నన్ను ఇలా మానసికంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుకు చనిపోయినప్పుడే నేను సగం చనిపోయాను. అప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేది. కానీ ఆ తర్వాత నా కొడుకు పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదలకు సహాయం చేస్తున్నాను.
ఇంత విషమివ్వండి:
అయినా నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి, నా ఇంట్లో ఇబ్బందులు పెట్టి, మహిళా ఆఫీసర్లను ఇబ్బంది పెట్టి మీరు ఏం సాధిద్దామని అనుకుంటున్నారని మంత్రి మీడియాను ఉద్దేశించి ప్రశ్నించారు. మీ రేటింగ్‌లు, వ్యూస్ కోసం అవాస్తవాలు రాయడం సరికాదు. ఛానళ్ల మధ్య పోటీ కోసం మహిళా అధికారులను ఇబ్బంది పెట్టొద్దు. ఇది సరైనదే అనుకుంటే కంటిన్యూ చేయండి. ఇంకా సరిపోదు అనుకుంటే నాకింత విషమిచ్చి చంపేయండి అని ఆవేదన వ్యక్తం చేశారు. నేను నా ఫోన్ నంబర్ మార్చానని ఓ చానల్ లో ప్రసారం చేశారు. ఆ నంబర్ చాలా పాతది. దాదాపు 20 ఏళ్లకు పైగా ఆ నంబర్ వాడుతున్నాను. అందరి వద్ద ఆ నంబర్ ఉండటంతో అందరు దానికే ఫోన్ చేస్తున్నారు. దాంతో పీఏ వద్ద ఉంచాను. తనకు గొంతులో అనారోగ్య సమస్య ఉందని దాని కోసం అమెరికాకు వెళ్లి వైద్యం చేయించుకున్నా తగ్గడం లేదన్నారు. పుట్టుకతోనే ఉన్న ఈ సమస్యకు తక్కువ మాట్లాడటమే పరిష్కారం అని వైద్యులు సూచించారు. అందుకే తాను తక్కువ ఫోన్ మాట్లాడుతానని చెప్పాను. ఆ నంబర్ తోనే నేను ఆరుసార్లు గెలిచాను. దాన్ని ఎలా పక్కన పెడతానన్నారు. ఎంతో కష్టపడితే ఐఏఎస్‍లు అవుతారు. అలాంటి వారిపై ఆఫీసర్ల మీద అభియోగాలు కరెక్ట కాదన్నారు.
సమగ్ర దర్యాప్తు చేయమని సీఎంను కోరుతున్న:
కలెక్టర్ల బదిలీలు సీఎం స్థాయిలో జరుగుతుంది. నా జిల్లాలోనే కాదు చాలా జిల్లాల్లో కలెక్టర్ల బదిలీ జరిగింది. నేను మంత్రిని అయ్యాక నల్గొండ జిల్లాల్లో నలుగురు కలెక్టర్లు మారారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియకుండానే ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. అధికారుల మీద అభాండాలు వేయడం మంచిది కాదన్నారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం తరపున సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎంని కోరుతున్నానన్నారు.
READ MORE .....
సినిమా టికెట్ రేట్ల పెంపుతో నాకు సంబంధం లేదు: మంత్రి కొమటిరెడ్డి
సంక్రాంతికి ఊరెళ్తున్నారా?.. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చర్యలు






