- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణాలను పణంగా పెట్టి ‘వర్క్ ఫ్రమ్ బైక్’ వద్దు: సీపీ సజ్జనార్
రోడ్లపై ప్రయాణిస్తూ బైక్‌లపై ల్యాప్‌టాప్‌లు వాడుతూ 'వర్క్ ఫ్రమ్ బైక్' చేయడం ప్రాణాంతమని వైరల్ వీడియోపై సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: వర్క్ ఫ్రమ్ పేరుతో ఓ వ్యక్తి రోడ్డుపై బైక్ నడుపుతూ.. దానిపై లాప్ టాప్ పెట్టుకొని వెళ్తున్న వీడియో వైరల్ అవుతుంది. సదరు వీడియోపై సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. బైక్‌లపై ప్రయాణిస్తూ ఆఫీస్ పనులు చక్కబెట్టే 'వర్క్ ఫ్రమ్ బైక్' వెర్రితనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదికి వస్తుంది" అనే సామెతను గుర్తు చేస్తూ.. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వాహనదారుడి ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా, అది వారి ప్రాణాలకే కాకుండా పక్కన వెళ్లే ఇతర అమాయక ప్రయాణికుల భద్రతకు కూడా ముప్పని హెచ్చరించారు. కడుపు నింపుకోవడానికి చేసే ఉద్యోగం, ప్రాణాలు కడతేర్చేలా ఉండకూడదని ఆయన ఉద్యోగులకు హితవు పలికారు.
కార్పొరేట్ డెడ్‌లైన్లు, పని ఒత్తిళ్లు ఎన్ని ఉన్నప్పటికీ ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలకు పాల్పడటం ముమ్మాటికీ బాధ్యతారాహిత్యమేనని సజ్జనార్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ తరహా దృశ్యాలపై స్పందిస్తూ.. దయచేసి రోడ్డుపై ల్యాప్‌టాప్‌లు ఓపెన్ చేయడం, ఫోన్లు మాట్లాడటం వంటి పనులు మానేయాలని పిలుపునిచ్చారు. మీ కోసం ఇంట్లో కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుంటారని గుర్తుంచుకొని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన కోరారు.
చంద్రబాబు పేరుతో సైబర్ మోసం.. బాధితుడి నుంచి భారీగా డబ్బు స్వాహా
హైదరాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్ బరితెగింపు.. రాంగ్ రూట్‌లో వచ్చి హల్ చల్






