- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఓ సుకుమారి’ టీజర్ విడుదల.. సర్‌ప్రైజులు, షాకింగ్ ట్విస్ట్‌లతో హైప్ క్రియేట్!
చిత్రబృందం విడుదల చేసిన టీజర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్, ఐశ్వర్య రాజేష్ కాంబోలో రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఓ..!సుకుమారి’. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని మహేశ్వర రెడ్డి మాలి నిర్మిస్తున్నారు. భరత్ దర్శన్ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈక్రమంలో.. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన టీజర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టీజర్ చూస్తుంటే ఈ సినిమా అందమైన గ్రామీణ నేపథ్యంలో సరికొత్తగా, ఎంతో ఆహ్లాదకరంగా సాగనున్నట్లు స్పష్టమవుతోంది. ఒక సున్నితమైన, మధురమైన ప్రేమకథతో పాటు కథలో ఆశ్చర్యపరిచే మలుపులు కూడా ఉన్నట్లు మేకర్స్ చూపించారు. ఇందులో తిరువీర్ పల్లెటూరి రాజకీయాల్లో పాల్గొనే యాదగిరి అనే యువకుడిగా కనిపించగా.. ఐశ్వర్య రాజేష్ పక్కా మాస్ పల్లెటూరి అమ్మాయి దామిని పాత్రలో కనిపించి మెప్పించింది.
తనదైన చురుకుదనం, అల్లరి మాటలతో ఊరి జనాన్ని ఇబ్బంది పెట్టే పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే.. ఊరిలో అందరినీ ఆటపట్టించే ఐశ్వర్య రాజేష్‌ను అమితంగా ఆరాధించే తిరువీర్, ఆమెను తనతో పాటు పాలిటిక్స్‌లోకి తీసుకువస్తాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి, అది పెళ్లికి దారితీస్తుంది. వివాహం తర్వాత వారిద్దరూ రాజకీయాల్లో విజయం సాధించారా? అసలు ఊరి ప్రజలు వీరిద్దరిని ఎందుకు తరుముతున్నారు? వీరి జీవితాల్లో ఎలాంటి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా రాబోతుంది. ఇక ఇందులో సర్‌ప్రైజులు షాకింగ్ ట్విస్ట్‌లు కూడా ఉండనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. పాపులర్ లిరిక్ రైటర్ పూర్ణచారి ఈ చిత్రంలోని అన్ని పాటలకు సాహిత్యం అందించడం విశేషం. ఇక టీజర్‌తో మంచి హైప్ క్రియేట్ చేసిన 'ఓ..! సుకుమారి' త్వరలోనే థియేటర్లలో అలరించడానికి సిద్ధమవుతోంది.






