ఎల్లారెడ్డిపేట మండలంలో మోగిన బడిగంట

by Jakkula.Mamatha |

ఎల్లారెడ్డిపేట మండలంలో నేటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తెరుచుకున్నాయి.

ఎల్లారెడ్డిపేట మండలంలో మోగిన బడిగంట
X

దిశ,ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలంలో నేటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తెరుచుకున్నాయి. ఏప్రిల్ 24న ముగిసిన పాఠశాలల తరగతులు తిరిగి నేడు తెరుచుకున్నాయి. ప్రతి ఏడాది జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేవి కానీ ప్రభుత్వం ఎండలు తీవ్రత దృష్టిలో పెట్టుకొని ఈనెల 15న పాఠశాలలు ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. రెండో శనివారం, ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి.

సోమవారం అమావాస్య కావడంతో మండల కేంద్రంతో పాటు, రాచర్ల బొప్పాపూర్ ప్రైవేట్ పాఠశాలలో సరస్వతి పూజ, వాహనాల పూజలు, ఈనెల 12న పూర్తి చేసుకున్నాయి. ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉదయం 9:05 గంటలకు ప్రారంభమై 4:15 గంటలకు తరగతులు పూర్తి కానున్నాయి. అదే విధంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 9:05 గంటలకు ప్రారంభమై 4:00 గంటలకు తరగతులు ముగియనున్నాయి. ఇప్పటికే మండలంలోని కస్తూర్బా, ఆదర్శ, మోడల్ స్కూల్ లకు వెళ్లే విద్యార్థుల కోసం ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు సిరిసిల్ల డిపో నుంచి సంబంధిత ప్రభుత్వ పాఠశాలలకు బస్సులు సరైన సమయానికి బస్సులు నడిపే విధంగా చూడాలని డిపో మేనేజర్ కోరినట్లు మండలంలోని సర్పంచులు తెలిపారు.

Next Story