- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోటల్ లో అగ్నిప్రమాదం.. రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం
by Taduka Kalyani |
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయి మాధవి హోటల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన ఘటన సోమవారం తెల్లవారు జామున వెలుగు చూసింది.

X
దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయి మాధవి హోటల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన ఘటన సోమవారం తెల్లవారు జామున వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. సాయి మాధవి హోటల్లో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. అప్పటికే హోటల్లో ఫర్నిచర్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. హోటల్లో ఎవరు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వేగంగా మంటలు వ్యాప్తి చెందడంతో ఫర్నిచర్, విద్యుత్ పరికరాలు, వంట సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. యజమాని ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేస్తున్నారు.
Next Story






