రెడ్డి కాలనీలో వరద నీటి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే

by Kodari Anjali |

చర్లపల్లి డివిజన్ రెడ్డి కాలనీ, భగవాన్ కాలనీ, తదితర కాలనీలలో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపనున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

రెడ్డి కాలనీలో వరద నీటి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే
X

దిశ, కాప్రా: చర్లపల్లి డివిజన్ రెడ్డి కాలనీ, భగవాన్ కాలనీ, తదితర కాలనీలలో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపనున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం రెడ్డి కాలనీ వాసులతో కలిసి కుషాయిగూడ సరిహద్దు నాగారం ఎస్వీ నగర్ శివ సాయి గార్డెన్ పరిసరాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... డివిజన్ పరిధిలోని రెడ్డి కాలనీ, భగవాన్ కాలనీ, శ్రీ కృష్ణా నగర్, తదితర కాలనీల ప్రజలు వరద ముంపు సమస్యతో అనేక ఏళ్లుగా బాధపడుతున్నట్లు తెలిపారు. అయితే ఆయా కాలనీల ప్రధాన రోడ్డుకు దిగువగా ఉండటంతో... వరద నీరు నివాసాల మధ్య నిలుస్తుందన్నారు. అయితే ఇక్కడ ముంపు సమస్యను తీర్చాలంటే... కాలనీల నుంచి జైల శాఖ కు చెందిన చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం మీదుగా సరిహద్దు అయిన నాగారం డివిజన్ మీదుగా అభివృద్ధి పనులను చేపట్టాల్సి ఉందన్నారు. అయితే సాంకేతికంగా సరిహద్దులు డివిజన్లుగా మారడంతో అభివృద్ధి పనులకు ఆటంకంగా మారిందన్నారు.

పూర్తిస్థాయిలో సహకరిస్తామని హామీ...

ఇప్పటికే వరద నీటి కాలువ పనుల ను చేపట్టేందుకు జైల శాఖ అధికారులతో మాట్లాడి అనుమతులను సైతం పొందినట్లు వివరించారు. ఇక నాగారం డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టాల్సిన విషయంపై ఘట్కేసర్ డిప్యూటీ కమిషనర్ వాణి తో పాటు, నాగారం ఎస్వి నగర్ స్థానిక కాలనీవాసులతో మాట్లాడినట్లు తెలిపారు. దానికి ఆమె సానుకూలంగా స్పందించి త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనుల విషయంలో పూర్తిస్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. త్వరలో వరద ముంపు సమస్య తీరెందుకు పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక వరద ముంపు బాధిత కాలనీవాసులు ఈ వర్షాలు వచ్చేలోపు అభివృద్ధి పనులను పూర్తి చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఇక మొదటి నుంచి అభివృద్ధి పనుల విషయంలో ఎమ్మెల్యే చూపిస్తున్న చోరువను ప్రశంసిస్తూ కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు సిహెచ్ సురేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, భూమ్ రెడ్డి, సిహెచ్ వెంకట్రాంరెడ్డి, జీవన్ రెడ్డి, సుదర్శన్, సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, సాయినాథ్ రెడ్డి, స్థానిక నాయకులు మహేష్ గౌడ్, తేళ్ల శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

Next Story