- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజురాబాద్ నియోజకవర్గ బీసీ జేఏసీ మహిళా జనరల్ సెక్రటరీగా దేవసాని ప్రియదర్శిని నియామకం
హుజురాబాద్ నియోజకవర్గ బీసీ జేఏసీ మహిళా జనరల్ సెక్రటరీగా హుజురాబాద్ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన దేవసాని ప్రియదర్శిని నియమితులయ్యారు.

దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ నియోజకవర్గ బీసీ జేఏసీ మహిళా జనరల్ సెక్రటరీగా హుజురాబాద్ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన దేవసాని ప్రియదర్శిని నియమితులయ్యారు. రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో ఈ నియామకం జరిగింది. బిసి, జెసి ఉద్యోగ సంఘాల అధ్యక్షులు నీలం వెంకటేశం, విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు రాందేవ్, కరీంనగర్ - పెద్దపల్లి ఉమ్మడి జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్ సాయిలు యాదవ్ ఆధ్వర్యంలో ఈ నియామక పత్రాన్ని అందజేశారు. దేవసాని ప్రియదర్శిని నియామకం పట్ల హుజురాబాద్ బీసీ జేఏసీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు...
ఆమె నియామకం బీసీ ఉద్యమ బలోపేతానికి, మహిళా చైతన్యానికి మరింత దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. హుజురాబాద్ బీసీ జేఏసీ అధ్యక్షులు సంధ్యల వెంకన్న, గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, ఆలేటి రవీందర్, ఆకుల సదానందం, ఎర్ర బుజ్జి, నారాయణ, బండారి శ్రీనివాస్, ఉప్పు శ్రీనివాస్, చిలుకమారి శ్రీనివాస్. ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, కోశాధికారి ఇప్పలపల్లి చంద్రశేఖర్,మహాత్మా జ్యోతిబాపూలే ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షులు బుర్ర కుమార్ గౌడ్, తాళ్లపెళ్లి అమరేందర్ గౌడ్, సురేందర్, బిక్షపతి, కుమార్ యాదవ్, గరవేణి శ్రీకాంత్, కొలిపాక క్రాంతి, మామునూరి ప్రవీణ్, నడిగోటి రమేష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రియదర్శినిని పలువురు నాయకులు శాలువాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు.






