తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి

by Taduka Kalyani |

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని దౌలత్‌నగర్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు దొనికేన శ్రీనివాస్ (48) తాటి చెట్టు పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు.

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి
X

దిశ, పర్వతగిరి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని దౌలత్‌నగర్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు దొనికేన శ్రీనివాస్ (48) తాటి చెట్టు పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్ రోజువారీ వృత్తిలో భాగంగా కల్లు గీయడానికి తాటిచెట్టు ఎక్కాడు. అయితే ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం లేకపోయింది. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతునికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్ మరణంతో దౌలత్‌నగర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

Next Story