- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి, నిషేధిత పొగాకు ఉత్పత్తులు సీజ్
by Taduka Kalyani |
శంషాబాద్ పోలీసులు, ఈగల్ (నార్కోటిక్ డ్రగ్స్) బృందం సంయుక్తంగా పాలమాకుల, కవేలీగూడ, ముచ్చింతల గ్రామాల పరిధిలోని పలు కిరాణా దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

X
దిశ, శంషాబాద్: శంషాబాద్ పోలీసులు, ఈగల్ (నార్కోటిక్ డ్రగ్స్) బృందం సంయుక్తంగా పాలమాకుల, కవేలీగూడ, ముచ్చింతల గ్రామాల పరిధిలోని పలు కిరాణా దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గంజా, నిషేధిత పొగాకు ఉత్పత్తులు, మాదకద్రవ్యాల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. కవేలీగూడ గ్రామంలోని ఎస్‌కే పాన్ షాప్, తవక్కల్ పాన్ షాప్ల్లో నిషేధిత టొబాకో ఉత్పత్తులు, గుట్కా ప్యాకెట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు శంషాబాద్ ఇన్‌స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపారు. ప్రజారోగ్యానికి హానికరమైన గుట్కా, నిషేధిత పొగాకు ఉత్పత్తులు, మాదకద్రవ్యాల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.
Next Story






