- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీజీఈసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.. స్లాట్ బుకింగ్‌కు ఈ నెల 18 వరకు చాన్స్
తెలంగాణ టీజీఈసెట్ (TG ECET)-2026 మొదటి విడత అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రక్రియకు సమయం ఆసన్నమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీఈసెట్-2026 మొదటి విడత అడ్మిషన్లకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్‌కు ఈ నెల 18 వరకు అవకాశం కల్పించారు. ఈ నెల 17 నుండి 19 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీజీఈసెట్-2026 అడ్మిషన్స్ కన్వీనర్ ఎ. శ్రీదేవసేన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. వెబ్ ఆప్షన్ల నమోదు ఈ నెల 17 నుండి 21 వరకు, సీట్ల కేటాయింపు ఈ నెల 24న లేదా అంతకు ముందే ఉంటుందన్నారు. సోమవారం నాటికి 3,233 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. మంచి కాలేజీలో, నచ్చిన కోర్సులో సీటు పొందేందుకు వీలుగా అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు https://tgecet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.






