Maruti Suzuki: కారు సర్వీసింగ్ ఖర్చులకు చెక్

by S Gopi |

ఈ ప్లాన్ ద్వారా, కస్టమర్లు తమ అవసరాలు, వాహన వినియోగాన్ని బట్టి వివిధ రకాల సర్వీస్ ప్యాకేజీలను ఎంచుకునే అవకాశం ఉంటుంది.

Maruti Suzuki: కారు సర్వీసింగ్ ఖర్చులకు చెక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: కారు మెయింటెనెన్స్ ఖర్చులను ముందుగానే ప్లాన్ చేసుకునే అవకాశం కల్పించేందుకు దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా సరికొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ‘స్మార్ట్ మెయింటెనెన్స్ ప్లాన్’ పేరుతో ఈ కొత్త ప్రీ-పెయిడ్ సర్వీస్ సదుపాయాన్ని సోమవారం ప్రారంభించింది. ఈ ప్లాన్ ద్వారా, కస్టమర్లు తమ అవసరాలు, వాహన వినియోగాన్ని బట్టి వివిధ రకాల సర్వీస్ ప్యాకేజీలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. లేబర్ ఛార్జీలు మాత్రమే ఉండే ప్లాన్‌ల నుంచి పార్ట్స్, లేబర్, ఇంజిన్ ఆయిల్, కూలెంట్లు, కమర్షియల్ వాహనాల మైనర్ సర్వీసులు వంటి సేవలు ఉన్న సమగ్ర ప్యాకేజీల వరకు అనేక ఆప్షన్లను కంపెనీ అందిస్తోంది. వాహనదారులు భవిష్యత్తులో సర్వీస్ ఖర్చులు పెరిగినా అదనపు భారం పడకుండా ఉండేందుకు ఈ ప్రీ-పెయిడ్ మోడల్ ఉపయోగపడుతుందని మారుతీ సుజుకి పేర్కొంది. కారు కొన్నప్పుడు లేదా కొన్న తర్వాత ఏదైనా మారుతీ సుజుకి వర్క్‌షాప్‌ వద్ద తమకు అవసరమైన ప్యాకేజీలను కస్టమర్లు ఎంచుకోవచ్చని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టకేయుచి తెలిపారు. ప్రీపెయిడ్‌ సర్వీస్‌ ప్యాకేజీల ద్వారా భవిష్యత్తులో కస్టమర్లకు 10 శాతం వరకు లేబర్‌ ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రైవేట్‌ వెహికల్‌ కస్టమర్లకు రెండేళ్లు లేదా 20,000, 10 ఏళ్లు లేదా 1,00,000 కిలోమీటర్ల ఆప్షన్లను ఎంచుకోవచ్చు. కమర్షియల్‌ కస్టమర్ల కోసం 10 ఏళ్లు లేదా 1,60,000 కిలోమీటర్ల వరకు ప్యాకేజీలు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.

Next Story