- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయనీయంగా నిరుద్యోగుల పరిస్థితి.. వలస కూలీల్లా నడిరోడ్డుపైనే!
బీహార్ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది.

దిశ, వెబ్ డెస్క్: బీహార్ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. పరీక్షలు రాస్తున్న నిరుద్యోగులకు మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని పరిస్థితిలో అక్కడి సర్కార్ ఉన్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. బీహార్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు వెళుతూ వందల మంది అభ్యర్థులు ఛప్రా రైల్వే స్టేషన్ బయట వలస కూలీల్లాగా నిద్రపోయారు. సరిపడా ట్రైన్స్ లేక.. ఉన్నవి సమయానికి రాక, బస్సులకు అధిక చార్జీలు చెల్లించలేక నానా అవస్థలు పడ్డారు.
బడ్జెట్ హోటల్స్ అందుబాటులో లేక... చిన్నపాటి లాడ్జిల్లో భారీగా డబ్బు కట్టలేక నడిరోడ్డుపైన తల దాచుకున్నారు. ఈ దారుణమైన సంఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఇది చూసిన నెటిజెన్స్ ఎమోషనల్ అవుతున్నారు. బీహార్ లో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైందని కామెంట్స్ చేస్తున్నారు. అసలు అక్కడ ప్రభుత్వం ఉందా ? నిద్రపోయిందా ? అంటూ నిలదీస్తున్నారు. పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు ఉన్న విషయం తెలిసినప్పటికీ... ప్రత్యేక సదుపాయాలు ఎందుకు కల్పించలేదని నిలదీస్తున్నారు. కాగా జూన్ 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పరీక్షలు జరుగుతున్నాయి.






