భార‌త జ‌ట్టులోకి 'స్పీడ్ గన్' బౌలర్

by velandi.Saikiran |

భార‌త జ‌ట్టులోకి 'స్పీడ్ గన్' బౌలర్ అశోక్ వ‌ర్మ రానున్నాడు.

భార‌త జ‌ట్టులోకి స్పీడ్ గన్ బౌలర్
X

దిశ‌, వెబ్ డెస్క్: గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన ప్రతి ఆటగాడికి వరుసగా భార‌త జ‌ట్టులో ఆఫ‌ర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఆఫ్గనిస్తాన్ తో జరిగిన టెస్ట్ సిరీస్, ప్రస్తుతం జరుగుతున్న వన్డేల నేపథ్యంలో గుజరాత్ ప్లేయర్లకు అవకాశాలు దక్కాయి. ఇక లేటెస్ట్ గా మరో గుజరాత్ టైటాన్స్ బౌలర్ అశోక్ వర్మ.. భారత A జట్టులోకి రాబోతున్నాడు. శ్రీలంక వేదికగా ట్రై సిరీస్ ఆడుతోంది భారత్ A.

ఈ జట్టులోకి 'స్పీడ్ గన్' బౌలర్ అశోక్ వర్మ ఎంపికయ్యారు. యుద్వీర్ సింగ్ గాయం బారిన పడ్డ నేపథ్యంలో అతని స్థానంలో అశోక్ వర్మ సెలెక్ట్ అయ్యాడు. 150 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలిగే అశోక్ వర్మ... స్లో బంతులు వేసి కూడా బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టగలడు. గత ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 22 వికెట్లతో ఒకే సీజన్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ప్లేయర్ గా కూడా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ లో కూడా బాగానే రాణించాడు. ఈ క్రమంలోనే అశోక్ వర్మ ఎంపికయ్యాడు.

Next Story