హర్మూజ్ పై ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..ఆ రోజు నుంచే ఓపెన్‌

by velandi.Saikiran |

హర్మూజ్ పై ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

హర్మూజ్ పై ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..ఆ రోజు నుంచే ఓపెన్‌
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఒప్పందంపై ఈ నెల 19వ తేదీన రెండు దేశాల ప్రతినిధులు సంతకాలు కూడా చేయనున్నారు. ఇలాంటి నేపథ్యంలో హర్మూజ్ జలసంధి ఓపెన్ పై సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్. ఈ శుక్రవారం నుంచి హర్మూజ్ జలసంధి పూర్తిగా ఓపెన్ అవుతుందని ఆయన వెల్లడించారు.

మైన్స్ నిర్వీర్యం చేసే ప్రక్రియ కొనసాగుతోందని... జలసంధి ఇప్పటికే పాక్షికంగా తెరుచుకుందని క్లారిటీ ఇచ్చారు. ఇరాన్ లో ప్రస్తుత లీడర్లు తెలివైన వారని... అందుకే ఒప్పందం కుదిరిందని వెల్లడించారు ట్రంప్. రాబోయే రోజుల్లో మిడిల్ ఈస్ట్ లో గొప్ప విషయాలు జరగబోతున్నాయని పేర్కొన్నారు. జీ7 సమ్మిట్ కోసం ట్రంప్ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తూ.. ఈ హర్మూజ్ జలసంధిపై ప్రకటన చేశారు.

Next Story