ఈ సినిమాతో ఒక్కొక్కర్ని కొడతాం..వేదిక‌పైనే స‌మంత వార్నింగ్ !

by velandi.Saikiran |   (  Updated:2026-06-15 21:16:48  IST  )

మా ఇంటి బంగారం సినిమాతో ఒక్కొక్కర్ని కొడతామంటూ వేదిక‌పైనే స‌మంత వార్నింగ్ ఇచ్చారు.

ఈ సినిమాతో ఒక్కొక్కర్ని కొడతాం..వేదిక‌పైనే స‌మంత వార్నింగ్ !
X

దిశ‌, వెబ్ డెస్క్: మా ఇంటి బంగారం సినిమాతో ఒక్కొక్కర్ని ప్రేమ‌తో కొడతామంటూ వేదిక‌పైనే స‌మంత వార్నింగ్ ఇచ్చారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. సమంత కథానాయకగా నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా... జూన్ 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ కు కేవలం మూడు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సమంత కీలక వ్యాఖ్యలు చేశారు.

మా ఇంటి బంగారం సినిమా అద్భుతంగా ఉంటుందని.. అన్ని సినిమాల రికార్డులను బద్దలు కొట్టడం గ్యారంటీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఇంటి బంగారం సినిమాతో ఒక్కొక్కరిని ప్రేమతో కొడతామని ఆమె వెల్లడించారు. ఏడాదికి రెండు సినిమాలు చేయాలని తనకు తెలుసని.. కానీ ఈ సంవత్సరం మాత్రం ఒక్క సినిమా బాగా చేసినట్లు వివరించారు. నిర్మాతలకు ఎంత ఒత్తిడి ఉంటుందనేది ఈ సినిమాతో తనకు అర్థమైంది అన్నారు. రాజ్, డీకే తక్కువగా మాట్లాడి ఎక్కువగా పని చేస్తారని ప్రశంసించారు. వారి నుంచి అదే నేర్చుకున్నానని... తన సినిమా రిలీజ్ అయి మూడేళ్లయిన ఫ్యాన్స్ ప్రేమ మాత్రం తగ్గలేదన్నారు.

Next Story