- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాత భవనానికి కొత్త సోకులు..జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చినా..!
సికింద్రాబాద్ ప్యారడైస్ సమీపంలో ఓ పాత భవన నిర్మాణాన్ని కూల్చి ఇష్టానుసారంగా నిర్మిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

దిశ, బేగంపేట : భవనం మరమ్మతుల పేరుతో నిబంధనలకు తూట్లు పొడు స్తూ ఇష్టానుసారంగా నిర్మాణాలు చేప డుతున్న వారిపై జీహెచ్ఎంసీ ప్రే క్షక పాత్ర పోషిస్తున్నది. సికింద్రాబాద్ ప్యారడైస్ సమీపంలో ఓ పాత భవన నిర్మాణాన్ని కూల్చి ఇష్టానుసారంగా నిర్మిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అంతస్తుల వ్యాపార భవనా న్ని కూల్చి వేసి నిర్మాణం చేపడుతుండడంతో స్థానిక వ్యాపారులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. ఇదేమి నిర్మాణం అంటూ గగ్గోలు పెడుతున్నారు. అయి నా సదరు భవన నిర్మాణదారుడు తన పని తాను చకచకా సాగిస్తూ ముందు కు వెళ్తున్నాడు. కొంతమంది స్థానిక వ్యాపారులు జీహెచ్ఎంసీ అమీర్పేట సర్కిల్ కార్యాలయానికి ఫిర్యాదు చేశా రు. వెంటనే రంగంలోకి దిగిన జీ హెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇ చ్చి చేతులు దులుపుకున్నారు.
ఇలాంటి నిర్మాణాలతో ప్రమాదం అని తెలిసినా ఏమీ చేయలేక కేవలం నోటీసులతో సరిపుచ్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. 30సంవత్సరాల క్రితం నిర్మించిన పాత భ వనాన్ని మరమ్మతుల పేరుతో లోపల భాగం పూర్తిగా కూల్చి వేసి కొత్త నిర్మా ణం చేపట్టడంతో పలువురు ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిర్మా ణం ప్రమాదం అని తెలిసినా వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా పసు లు శరవేగంగా కొనసాగిస్తున్నారు. జీ హెచ్ఎంసీ అధికారులు ముందడుగు వేసి పనులు నిలిపి వేసి చర్యలు తీసుకుంటారా? లేక నోటీసులతోనే ఆగిపో తారా వేచి చూడాలి. ఓ అధికార పార్టీ కి చెందిన ఓ నేత అండతో ఈ అక్రమ నిర్మాణం కొనసాగుతుందని ప్రచారం జోరుగా సాగుతున్నది.






