- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెమ్యూనరేషన్ తగ్గించుకున్న స్టార్ హీరో !
by velandi.Saikiran |
విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించిన విక్రమ్.. తన రెమ్యూనేషన్ భారీగా తగ్గించుకున్నారట.

X
దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరో విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించిన హీరో విక్రమ్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన రెమ్యూనేషన్ భారీగా తగ్గించుకున్నారట. అంతేకాదు, సినీ నిర్మాతలపై భారం తగ్గించడానికి ప్రాఫిట్ షేరింగ్ మోడల్ ఎంచుకున్నట్లు కూడా టాక్ నడుస్తోంది. గతంలో ఒక్కో సినిమాకు రూ.35 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునేవాడట. ఇదే అతని కెరీర్ లో గరిష్టమని తెలుస్తోంది. అయితే ఆ రెమ్యూనరేషన్ ను ఇప్పుడు రూ.20 కోట్లకు తగ్గించుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా నుంచి తక్కువ ఛార్జ్ చేయనున్నాడట. ఇక ఈ సినిమా ఈ ఏడాది చివరలో లేదా 2027 ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా హీరో అజిత్ కూడా తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నట్లు తెలుస్తోంది.
Next Story






