- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో దారుణం.. ప్రియుడితో గడుపుతున్న సమయంలో ఏడ్చినందుకు కొడుకును చంపిన తల్లి
రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో గడిపేందుకు అడ్డు వస్తున్నాడని కన్నకుమారుడిని తల్లే హత్య చేసింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసరలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో గడిపేందుకు అడ్డు వస్తున్నాడని కన్నకుమారుడిని తల్లే హత్య చేసింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసరలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన జ్యోతి, స్వామి భార్య భర్తలు. వీరికి నాలుగేళ్ల కూతురు, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. ఉపాధి నిమిత్తం వీరు మేడ్చల్ జిల్లా కీసరలో నివాసం ఉంటున్నారు. స్వామి క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా జ్యోతి ఇంటి వద్దనే ఉంటూ పిల్లలను చూసుకుంటోంది.
అయితే జ్యోతికి పెళ్లికి ముందు నుండే యాదాద్రి భువనగిరి జిల్లా మాదాపూర్ గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. పెళ్లి తరవాత కూడా జ్యోతి నవీన్ తో ఆ సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే గత నెల 29న ప్రియుడు ఇంటికి రాగా ఇద్దరూ ఏకాంతంగా గడిపారు. ఆ సమయంలో జ్యోతి రెండేళ్ల కుమారుడు ఏడవడంతో ప్రియుడు నవీన్ కు కోపం వచ్చింది. ఏడుపు బయటకు వినిపిస్తే సమస్య అవుతుందని ఆ పిల్లాడిని చంపేద్దామని నవీన్ జ్యోతికి చెప్పాడు. ప్రియుడు చెప్పినట్టుగానే కామంతో కళ్లు మూసుకుపోయిన జ్యోతి కుమారుడిని నేలకేసి అత్యంత దారుణంగా కొట్టింది.
దీంతో పిల్లాడు అక్కడిక్కడే మరణించాడు. భర్త ఇంటికి వచ్చిన తరవాత బాబు ఫిట్స్ వచ్చి చనిపోయాడని నమ్మించింది. బంధువులను కూడా జ్యోతి అలాగే నమ్మించడంతో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆ తరవాత భార్య ప్రవర్తనలో మార్పు రావడంతో భర్త స్వామి నిలదీశాడు. కుటుంబ సభ్యులతో పంచాయితీ పెట్టించాడు. భర్త, కుటుంబ సభ్యులు పదే పదే జ్యోతిని నిలదీయడంతో తానే కుమారుడిని చంపినట్టు ఒప్పుకుంది. భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాబు డెడ్ బాడీని బయటకు తీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. కసాయి తల్లిని అరెస్ట్ చేయగా ఆమె ప్రియుడు నవీన్ పరారీలో ఉన్నాడు.






