- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యోగాతోనే భారతీయ సంస్కృతికి ప్రపంచ గుర్తింపు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
by Jakkula.Mamatha |
యోగాతో భారతీయ సంస్కృతికి గుర్తింపు లభించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు.

X
దిశ,మేడ్చల్ బ్యూరో: యోగాతో భారతీయ సంస్కృతికి గుర్తింపు లభించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. యోగాతో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని సూచించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో శనివారం జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కౌంట్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, ఎంపీలు ఈటల రాజేందర్, డాక్టర్ లక్ష్మణ్, సినీ హీరోయిన్ పాయల్ రాధకృష్ణ, డింపుల్ హయతి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. యోగాను ప్రతి ఒక్కరు సాధన చేయాలని, తద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు.
Next Story






