- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర విషాదం.. సముద్రంలో మునిగి ఐదుగురు పర్యాటకులు మృతి!
మహారాష్ట్ర రత్నగిరి జిల్లా గణపతిపులే సముద్ర తీరంలో ఘోర ప్రమాదం.. ఐదుగురు పర్యాటకులు సముద్రంలో మునిగి మృతి!

దిశ, వెబ్ డెస్క్: సరదాగా సాగాల్సిన పర్యటనలో అనుకోని ప్రమాదం జరిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన మహారాష్ట్ర లోని ప్రముఖ పుణ్యక్షేత్రం, పర్యాటక ప్రాంతమైన రత్నగిరి జిల్లాలో శనివారం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. గణపతిపూలే (Ganpatipule) తీరంలో సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురు పర్యాటకులు రాకాసి అలల ధాటికి కొట్టుకుపోయి, సముద్రంలో మునిగి మృతి చెందారు. మృతులంతా ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుందని రత్నగిరి జిల్లా సమాచార అధికారి (DIO) మీడియాకు వెల్లడించారు.
వీరంతా వారాంతపు సెలవు దినం కావడంతో గణపతిపూలే క్షేత్రాన్ని సందర్శించడానికి వచ్చారని, సముద్రంలోకి దిగిన సమయంలో అక్కడి వాతావరణం, అలల తీవ్రతను సరిగ్గా అంచనా వేయలేకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోందని జిల్లా సమాచార అధికారి పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక మత్స్యకారులు, లైఫ్‌గార్డులు, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ లాభం లేకపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పర్యాటకులు సముద్ర తీరాల్లో విహరించేటప్పుడు స్థానిక హెచ్చరికలను పాటించాలని, అలల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నీటిలోకి దిగవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.






